Mahua Flower Laddu: గిరిజన ప్రాంతాల్లో పండే ఇప్ప పువ్వుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకప్పుడు మత్తు పదార్థం అయినా సారా కాసేవారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యంవంతంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు.+
ఇప్ప పువ్వు లడ్డు..! తింటే ఎంతో ఆరోగ్యం

Mahua Flower Laddu: గిరిజన ప్రాంతాల్లో పండే ఇప్ప పువ్వుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకప్పుడు మత్తు పదార్థం అయినా సారా కాసేవారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యంవంతంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. విశాఖపట్నంలోని గిరిజనులు తయారుచేసిన ఎప్పపువ్వు లడ్డూలు అమ్మకాలు చేస్తున్నారు. ఇవన్నీ అదిలాబాద్ జిల్లా , ఉట్నూర్ గ్రామం నుండి ఆదివాసీలు ఈ లడ్డూలు తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు. విశాఖలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు.
ఇప్ప పువ్వు లడ్డూలు..
ఈ లడ్డు ఇప్ప పువ్వు , పల్లీలు , నువ్వులు , కాజు , యాలకులు , బెల్లం తో తయారు చేస్తారు. ఈ లడ్డు తింటే ఎంతో ఆరోగ్యం , చిన్న పిల్లలు నుండి గర్భిణీ స్త్రీలు వరకు అందరూ తినవచ్చు అంటున్నారు నిర్వాహకులు భాయ్.. రక్త హీనత పెరుగుతుంది. కొవ్వు కరిగిస్తుంది అంటున్నారు. ఇది ఒక్కో బాక్స్ 400 రూపాయలు అమ్మకాలు చేస్తున్నారు. ఇప్ప పువ్వు మంచి ఆరోగ్యం కావడంతో నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే 9492369323 కి కాల్ చేస్తే పార్సిల్ చేస్తాము అని గిరిజనులు అంటున్నారు.
నోరు తీపిగా.. ఆరోగ్యం భద్రంగా..
అటవీ ఉత్పత్తులు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఇప్పపువ్వు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు ఈ ఇప్పపువ్వుతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ ఇప్పపువ్వుతో అంబలి, పకోడి, గారెలు ఇలా పలు రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని కడుపునింపుకుంటారు. జబ్బు చేస్తే ఔషధంగా కూడా వాడుకుంటారు.
ఆయుర్వేద ఔషధం ఈ స్వీట్..
ఇలా ఇప్పపువ్వుతో గిరిజనులు పలు రకాలుగా లాభపడుతున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నోట ఈ ఇప్పపువ్వు మాట విన్నప్పటి నుండి ఈ ఇప్పపువ్వు లడ్డూలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎవరికైనా కావాలి అంటే దేశంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాము అని అంటున్నారు. ప్రోటీన్ ఇప్ప పువ్వు లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
