మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ‘క్లీనింగ్ సెంటర్’ పెద్దపేగు. మనం తిన్న ఆహారం చిన్నపేగులో పోషకాలను అందించిన తర్వాత, మిగిలిన వ్యర్థం పెద్దపేగుకు చేరుతుంది. ఇక్కడ నీటి శోషణ జరిగి, వ్యర్థం మలంలా మారుతుంది. ఒకవేళ పెద్దపేగు అనారోగ్యానికి గురైతే.. గ్యాస్, అలసట నుంచి క్యాన్సర్ వరకు దారితీయవచ్చు. అందుకే పేగులను క్లీన్ చేసే ఈ 5 ఆహారాలు తప్పనిసరి:
1. చిలగడదుంపలు (Sweet Potatoes)
వీటిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ A గా మారి పేగు లోపలి పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒక ఉత్తమ ‘ప్రీబయోటిక్’. అంటే ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. ఆకుపచ్చని కూరగాయలు (Green Vegetables)
క్యాబేజీ, బ్రకోలీ వంటి కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని వదిలిస్తుంది. వీటిలోని ‘గ్లూకోసినోలేట్స్’ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
3. ట్యూనా చేప (Tuna Fish)
పెద్దపేగులోని టాక్సిన్స్‌ను క్లీన్ చేయడానికి ‘సెలీనియం’ అనే ఖనిజం అవసరం. ఇది ట్యూనా చేపలో సమృద్ధిగా ఉంటుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పేగుల్లో వాపును (Inflammation) తగ్గించి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి.
4. తాజా పండ్లు (Fresh Fruits)
యాపిల్స్, బేరి పండ్లలో ఉండే ‘పెక్టిన్’ అనే పీచు పదార్థం వ్యర్థాలను బయటకు నెట్టి సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది. అరటిపండులోని మెగ్నీషియం పేగు కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
5. పెరుగు (Yogurt)
పెరుగు ఒక సహజసిద్ధమైన ‘ప్రోబయోటిక్’. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులోని కాల్షియం పేగు కణాల అసాధారణ పెరుగుదలను అడ్డుకుంటుంది.
Disclosure
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్‌షిప్ గైడెన్స్, ఫిట్‌నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
