రూ. 25 కే బ్రోకలీ.. అతి తక్కువ ధరకే ఖరీదైన వెజిటెబుల్

Table of Content

కూరగాయల్లో అధికంగా పోషకాలు కలిగిన బ్రోకలీ ఇక అత్యంత చవకగా మీకు దొరుకుతుంది. ముఖ్యంగా పోషకాలు గనిగా చెప్పుకునే బ్రోకలీని ప్రస్తుతం మీరే చాలా తక్కువ ధరకు తీసుకోవచ్చు.

Broccoli Cheap Price: కూరగాయల్లో అధికంగా పోషకాలు కలిగిన బ్రోకలీ ఇక అత్యంత చవకగా మీకు దొరుకుతుంది. ముఖ్యంగా పోషకాలు గనిగా చెప్పుకునే బ్రోకలీని ప్రస్తుతం మీరే చాలా తక్కువ ధరకు తీసుకోవచ్చు. విశాఖలోని అన్ని రైతు బజార్లలో కూడా మరీ ముఖ్యంగా చెప్పాలంటే విశాఖపట్నంలోని ఎంవిపి రైతు బజార్లో 20 రూపాయల నుంచి 30 రూపాయలు లోపే బ్రోకలీ మీరు పొందొచ్చు. ఎందుకంటే బ్రోకలీ రేట్లు బాగా తగ్గిపోయాయి. పంట బాగా ఎక్కువగా దిగుబడి రావడం విశాఖపట్నం చుట్టుపక్కల ఈ పంట ఎక్కువగా పండడంతో విశాఖపట్నం రైతు బజార్లలో బ్రోకలీ ఎక్కువగా దర్శనమిస్తోంది. కాలీఫ్లవర్ 20 రూపాయలు ఉంటే అదే స్థాయిలో 25 రూపాయలకే బ్రోకలీ అంటే ఐదు రూపాయలు మాత్రమే ఎక్కువగా ఒక పువ్వు లభిస్తోందని రైతులు చెబుతున్నారు.

బ్రోకలీ వెరీ చీప్ గురూ..

ఇప్పటివరకు బ్రోకలీ, లెట్యూస్ లాంటి కూరగాయలు అంటే చాలామందికి గుర్తొచ్చేది షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు మాత్రమే గుర్తొస్తాయి. ఇవి ఎక్కువగా ఇంపోర్టెడ్ కూరగాయలే కావడంతో కేజీకి 200 రూపాయల వరకూ ధర పలికేవి. సంపన్నులు, శ్రీమంతుల కిచెన్‌లో, ఫ్రిజ్‌లో కనిపించే ఈ కూరగాయ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విదేశాల నుంచి వచ్చే కూరగాయలకంటే తక్కువ ధరలకు అదే స్థాయి నాణ్యతతో ఇవే కూరగాయలు ఇప్పుడు మన ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పండుతున్నాయి. అరకు లోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంతాలైన కె.కోటపాడు, దేవరపల్లి మండలాల్లో బ్రోకలీ, లెట్యూస్ వంటి పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు.

ఇప్పుడు మన దగ్గరే సాగు..

చల్లని వాతావరణం, సారవంతమైన నేల ఉండటంతో ఈ కూరగాయలు ఇక్కడ మంచి దిగుబడితో వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంపోర్టెడ్ గా భావించిన కూరగాయలు ఇప్పుడు పూర్తిగా లోకల్‌గా మారిపోయాయి. మార్కెట్ ధరలతో పోలిస్తే రైతు బజార్లలో ఇవి చాలా తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కూరగాయలు పూర్తిగా ఆర్గానిక్‌గా, సేంద్రియ ఎరువులతో పండించడంతో ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని రైతులు తెలిపారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలోనే పండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇది చదవండి :  చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రమాదమే!

వెరీ చీప్‌ రేటుకో ఖరీదైన కూరగాయ..

మొన్నటి వరకూ రైతు బజార్లలో బ్రోకలీ కేజీ ధర సుమారు 80 రూపాయలుగా ఉండేది. చిన్న సైజు బ్రోకలీ అయితే 60 రూపాయలకే లభించేది. ప్రస్తుతం అదే బ్రోకలీ చిన్న పువ్వు 25 రూపాయలు, పెద్దది 40 రూపాయలకు లభిస్తోంది. దీంతో చాలామంది బ్రోకలీని కొనుక్కొని వెళ్తున్నారని రైతులు చెబుతున్నారు. ధర తక్కువగా ఉండటమే కాదు, పెద్ద పువ్వు సైజ్‌తో నాణ్యత కూడా బాగుండటంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారట. ఇంకా మరో నెల రోజుల పాటు ఈ కూరగాయలు అందుబాటులో ఉంటాయని, చలి సీజన్ ముగిసే వరకూ బ్రోకలీ రైతు బజార్లలో కనిపిస్తాయని అంచనా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

Trending News

Editor's Picks

సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎప్పటికప్పుడు వేగంగా, నిష్పక్షపాతంగా మరియు లోతైన విశ్లేషణతో ప్రజలకు అందించడమే Newsz9 ప్రధాన లక్ష్యం. తాజా రాజకీయాలు, సాంకేతికత మరియు సామాజిక అంశాలపై విశ్వసనీయమైన సమాచారం కోసం మీ నమ్మకమైన డిజిటల్ వార్తా వేదిక.

Must Read

©2026- All Right Reserved to NEWS Z9