
ఏపీ పోలీసుల తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం: ఎఫ్‌బీఐ పేరు వాడటంపై సంచలన వ్యాఖ్యలు!
రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో పోస్టులను తొలగించే ప్రక్రియలో భాగంగా ఏపీ పోలీసులు అమెరికాకు చెందిన 'ఎఫ్‌బీఐ' (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించడంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు.































