
ద్రవ్యోల్బణ హెచ్చరిక: సెప్టెంబర్‌లో వర్షాలు బలహీనపడితే 5.5 శాతానికి పైగా పెరుగనున్న రిటైల్ ద్రవ్యోల్బణం!
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలలో బలహీనంగా ముగియడం మరియు ఎల్ నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ వర్షాలు తీవ్రంగా లోపిస్తే తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం 5.5 శాతం లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.











